26వ వార్డులో 'ప్రజా పాలన' సభ
KNR: వేములవాడ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో గురువారం 'ప్రజా పాలన - 99 రోజుల యాక్షన్ ప్లాన్' వార్డు సభ నిర్వహించారు. కౌన్సిలర్ మామిండ్ల అమర్శ లక్ష్మీరాజ్యం, నోడల్ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొని స్థానిక సమస్యలపై చర్చించారు.