అదనపు డీసీపీగా శుభం ప్రకాష్ బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా నగ్రాలే శుభం ప్రకాష్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీపీ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రకాష్ గతంలో కరీంనగర్ రూరల్ ఏసీపీగా విధులు నిర్వహించారు. బదిలీల ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాకు అదనపు డీసీపీగా వచ్చారు.