ఆముదాలవలసలో కమ్మేసిన మంచు

ఆముదాలవలసలో కమ్మేసిన మంచు

SKLM: ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి విపరీతంగా పొగ మంచు కమ్మేసింది. ఓ వైపు చలి తీవ్రత కూడా పెరగడంతో వృద్ధులు, చిన్నారులు చలికి వణుకు పోతున్నారు. ఈ మంచు ముసుగుతో పొలాలకు వెళ్లే రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . రోడ్లపై రాకపోకలు సాగించే వారికి ఎదురుగా వచ్చిన వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు.