'విజ్ఙానంతోనే విజయ శిఖరాలకు చేరుకోగలం'
PPM: విజ్ఞానంతోనే విజయ శిఖరాలను చేరుకోగలమని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి అన్నారు. ఇవాళ స్దానిక గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థులతో సెల్ ఫోను వినియోగం, పిల్లల్లో కొరవడుతున్న నైతిక విలువలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దల పట్ల కానరాని గౌరవభావం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.