కౌశల్ సైన్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన హై స్కూల్ విద్యార్థులు

కౌశల్ సైన్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన హై స్కూల్ విద్యార్థులు

E.G: కౌశల్ సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీల్లో గుమ్మలదొడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాలకు చెందిన కుమారి, గీతశ్రీ జిల్లా స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించినట్లు హెచ్‌ఎం లక్ష్మీకాంతం గురువారం వెల్లడించారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వీరు, ఈ నెల 27న తిరుపతిలో జరగనున్న రాష్ట్ర పోటీలో పాల్గొంటారు.