ఇంటింటికీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్
VSP: విశాఖలో జీవీఎంసీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రోజుకు సుమారు 50 నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన ఈ ల్యాబ్ రాష్ట్రంలో తొలి మొబైల్ సదుపాయం. రూ. 40 లక్షలతో ఏర్పాటైన ఈ వాహనం 98 వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి నీటి నాణ్యతను పరీక్షిస్తోంది. పీహెచ్, క్లోరిన్, టీడీఎస్, టర్బిడిటీ వంటి ప్రమాణాలను వెంటనే నిర్ధారిస్తున్నారు.