'గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలి'
ASR: గంజాయి సాగు, రవాణా చేయడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. ఆదివారం మంప ఎస్సై కే.శంకరరావుతో కలిసి రాజేంద్రపాలెం వారపు సంతలో పర్యటించారు. సంతకు వచ్చిన గిరిజనులతో సమావేశమయ్యారు. గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని చెప్పారు. గంజాయి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు.