'ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు'
ADB: పట్టణంలోని సరస్వతీ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు లక్ష్యం పేరుతో ముద్రించిన లేఖలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కష్ట పడి కాకుండా ఇష్టంతో చదివితే పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి కీలక దశ అని, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.