కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కలశ జ్యోతి ప్రదర్శన

కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కలశ జ్యోతి ప్రదర్శన

అనకాపల్లి గవరపాలెం శతకంపట్టు కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మార్గశిర పౌర్ణమి సందర్భంగా కలశజ్యోతి ప్రదర్శన నిర్వహించారు. శీతలదుర్గగా దర్శనం ఇచ్చిన కనకదుర్గమ్మ తల్లిని పలువురు భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కాండ్రేగుల నాయుడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.