'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు'
NTR: జిల్లాలో మద్యం, డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.