ఎస్సీ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ
ADB: బోథ్ మండలంలోని పొచ్చేర గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి రోజు కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నానన్నారు.