70 రోజులు బంగ్లాదేశ్‌లో బందీలుగా
విశాఖ నుంచి వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో చొరబడటంతో 70 రోజులు బందీలుగా అక్కడ వేదన జీవితాన్ని గడిపారు. సోమవారం విశాఖ చేరుకున్న వీరికి సంఘం పెద్దలు, కుటుంబ సభ్యులు సన్మానించి కన్నీటి పర్యంతం అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో సుధాసాగర్ వీరికి నిత్యవసర సరకులు అందించారు.