ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం: ప్రిన్సిపల్
NDL: రుద్రవరం ఆదర్శ పాఠశాలలో ఈనెల 12న 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఈనెల 5 నుంచి ఏపీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.