మెప్మా ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం సందర్శన
MBNR: జిల్లాలోని మెప్మా కార్యాలయంలో 'మహబూబ్ నగర్ ఫస్ట్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరించి, యువత శిక్షణను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి పురోగతిని తెలుసుకున్నారు.