ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం విస్తృత తనిఖీలు
విశాఖ: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ ఫంక్వల్ శుక్రవారం సిలాక్‌ఝోరి రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిలాక్‌ఝోరి-దిలిమిలి స్టేషన్ల మధ్య ఉన్న కర్వ్ నెం. 433ను తనిఖీ చేసి సాంకేతిక అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.