రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
E.G: గోపాలపురం మండలంలోని వేళ్లచింతలగూడెం, పెద్దాపురం గ్రామాల మధ్య ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్‌ను బలంగా ఢీకొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు.