బ్యాంకు ఖాతా సీజ్
SRPT: మునగాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి కోదాడ పట్టణంలోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది. ట్రేడింగ్ యాప్ ద్వారా డబ్బులు ఈ అకౌంట్లోకి వచ్చాయని ఇటీవల అధికారులు సదరు ఖాతాను సీజ్ చేశారు. ఇదేంటని బ్యాంకు సిబ్బందిని ఖాతాదారుడు ప్రశ్నించగా.. సైబర్ పోలీసుల నుంచి ఫిర్యాదు అందడంతో సీజ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.