జిల్లాలో 54.78 శాతం పోలింగ్ నమోదు
GDWL: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయానికి జిల్లాలో సగటున 54.78 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. ధరూర్ 56.74%, గద్వాల 47.93%, గట్టు 51.61%, కేటీదొడ్డి 65.88% పోలింగ్ జరిగింది.