సమస్యలను పరిష్కరించాలి

SKLM: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం కాంప్లెక్స్ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉండి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులను చేపట్టిన సందర్భంగా ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.