మే 12నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు

VZM: మే 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై తమ చాంబర్లో సోమవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలన్నారు.