కడప యువకుడు తెలంగాణలో మృతి
KDP: కలసపాడు(M) ఎగురామారావు పురానికి చెందిన వ్యక్తి శుక్రవారం తెలంగాణలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎగురామారావు పురానికి చెందిన శ్రీనివాసులు తెలంగాణలోని కొండగల్‌లో లారీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. కొండగల్‌లోని దౌలత్ బాదులో రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్ శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.