కారు, బైక్ ఢీ.. ఒకరికి గాయాలు

కారు, బైక్ ఢీ.. ఒకరికి గాయాలు

ప్రకాశం: అద్దంకి మండలం మేదరమెట్ల సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.