50 పడకల నూతన ఆసుపత్రిని ప్రారంభించాలి: సీపీఐ

KMM: కల్లూరు మండల కేంద్రంలో, ప్రభుత్వం ఇటీవల నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి రోగులకు సేవలు అందేలా చూడాలని, సీపీఐ కల్లూరు మండల కార్యదర్శి దామాల దయాకర్ రావు అన్నారు. ఆదివారం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని వారు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పెచ్చులు ఉడి వర్షపు నీరు ఆసుపత్రిలోకి చేరాయని అన్నారు.