'కాంత' ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?
హీరో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సె ముఖ్య పాత్రల్లో నటించిన 'కాంత' మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించింది. అయితే ఈ సినిమా ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈ నెల 12 నుంచి విడుదల చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగు, ఇతర భారతీయ భాషలలో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.