'హామీలు నెరవేర్చకపోతే ప్రాణాలు తీసుకుంటా'

'హామీలు నెరవేర్చకపోతే ప్రాణాలు తీసుకుంటా'

MLG: పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆరు నెలల్లో నెరవేర్చకపోతే ప్రాణాలు తీసుకుంటానని వెంకటాపూర్(M) ఇంచంచరుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవేందర్ తెలిపారు. తనను గెలిపిస్తే 6 నెలల్లో కాలనీలో విద్యుత్ స్తంభాలు వేసి దీపాలు వెలిగిస్తానన్నారు. చీకట్లో మగ్గుతున్న కాలనీవాసుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఆయన హామీతో గ్రామంలో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.