నేడు ఒంగోలులో విద్యుత్ అంతరాయం

నేడు ఒంగోలులో విద్యుత్ అంతరాయం

ప్రకాశం: ఒంగోలు నగరంలోని విద్యుత్ మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ డీఈఈ పాండు రంగా రావు తెలిపారు. ఒంగోలు నగర పరిధిలోని విఐపి రోడ్డు, లాయర్ పేట, పాత సుజాతనగర్, మంగమూరు రోడ్డు, నాగేంద్ర నగర్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ విషయాన్న గమనించాలని కోరారు.