స్వచ్ఛందంగా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్న యువత

VZM: మధుపాడ నుంచి భూదేవి పేట వరకు రోడ్డుకిరువైపులా మంగళవారం జంగిల్ క్లియరెన్స్ చేశారు. భూదేవిపేట యువత ఆధ్వర్యంలో తుప్పలు, డొంకలు తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా తుప్పలు పెరగడంతో మలుపులు ఉన్న ఎదురెదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకూ కనిపించక పోవడంతో వాహనాలు ఢీకొని పలువురు గాయపడుతున్న విషయం విదితమే. ప్రమాదాలు నివారణకు యువత ముందుకు వచ్చారు.