VIDEO: క్రమశిక్షణ ప్రతి పోలీసు అధికారికే ప్రాణం వంటిది: SP
TPT: పోలీసు వృత్తి అనేది సాధారణ ఉద్యోగం కాదని, సమాజ రక్షణ బాధ్యతతో కూడిన ప్రజాసేవ అని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా పోలీసు శాఖలో నూతనంగా నియమితులైన ఎస్సైలతో సమావేశమై దిశ నిర్దేశం చేశారు. ప్రజలకు సేవ చేయడం వరమని, ప్రజలందరూ మన కుటుంబ సభ్యులు అని చెప్పారు. క్రమశిక్షణ ప్రతి పోలీసు అధికారికే ప్రాణం వంటిదని తెలిపారు.