విద్యుదాఘతంతో ఒకరు మృతి

మేడ్చల్: విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన తూంకుంట మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే కందెల లక్ష్మణ్(26) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం స్థానికంగా ఉన్న పౌల్ట్రీఫామ్‌లో దాన సంచులను దించుతుంటే లక్ష్మణు విద్యుత్తు తీగతగిలింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.