VIDEO: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే గ్రామసభలు
SRPT: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని సీడీపీవో, స్పెషలాఫీసర్ శ్రీజ అన్నారు. గురువారం తుంగతుర్తి మండలం బండరామారంలో సర్పంచ్ కోరుకుప్పల నరేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.