తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత
VZM: విజయనగరం పట్టణం బాబా మెట్టకు చెందిన బూర రాజేశ్వరి తన కుటుంబంతో నివాసం ఉంటోంది. కాగా, మతిస్థిమితం లేని ఆమె కుమారుడు దిలీప్(13) ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బాలుడు తల్లి ఫిర్యాదు మేరకు టూ టౌన్ సీఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. పూల్ బాగ్ కాలనీ శివారులో బాలుడిని గుర్తించి.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.