VIDEO: మళ్లీ పెరుగుతున్న గోదావరి

BDK: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ప్రవాహం, మంగళవారం మధ్యాహ్నం 27.50 అడుగులుగా ఉన్న నీటిమట్టం బుధవారం ఉదయం 9 గంటలకు 30.10 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గోదావరి నుంచి 4,41,424 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తాంది.