అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బొలెరో

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బొలెరో

SKLM: మందస (M), హరిపురంగ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొబ్బరి బోండాల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బండిలోని బోండాలు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది, ట్రాఫిక్‌ను క్లియర్ చేసారు.