మద్యం దుకాణాలు మూసివేత: ఎస్పీ
GDWL: ఈనెల 17న జరగనున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి, ఇటిక్యాల, మనోపాడ్, ఉండవెల్లి, అలంపూర్ మండలాల పరిధిలో నేటి సాయంత్రం నుంచి 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలను పూర్తిగా మూసి ఉంచాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.