అసలైన విలన్‌లు వాళ్లే: ఎంపీ మల్లు రవి
TG: బీఆర్‌ఎస్ నేతలపై ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అసలైన విలన్‌లు కేసీఆర్, KTR, హరీష్ రావు అని అన్నారు. ప్రజల అవసరాలను మర్చిపోయి.. ధర్నా చౌక్‌ను ఎత్తివేసిన బీఆర్‌ఎస్ పార్టీ చరిత్రగా మిగిలిపోతుంది అని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుహ్యమైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.