అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమల కార్యక్రమం
MDCL: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో బోడుప్పల్‌లో డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి 358వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కృషి, త్యాగం ఫలితంగానే భారతీయులందరికీ స్వేచ్ఛ, సమానత్వం లభించాయని ప్రతి ఒక్కరూ నిత్యం అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.