ఆస్తి పన్ను చెల్లించకుంటే దుకాణాలు సీజ్
MBNR: కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను సకాలంలో చెల్లించని పక్షంలో వాణిజ్య దుకాణాలను సీజ్ చేస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్న పన్ను వసూళ్ల ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.