బెంగళూరు వెళ్లి పెన్షన్ సొమ్ము పంపిణీ

బెంగళూరు వెళ్లి పెన్షన్ సొమ్ము పంపిణీ

ATP: గుత్తి సచివాలయ ఉద్యోగి రఫీ, 12వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జ్ రామకృష్ణ శుక్రవారం బెంగళూరు వెళ్లి సుశీలమ్మ అనే పెన్షన్ లబ్ధిదారునికి పెన్షన్ సొమ్మును అందజేశారు. సుశీలమ్మ గత రెండు నెలలుగా అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో రెండు నెలలు పెన్షన్ తీసుకోలేదు. మూడో నెల తీసుకోకపోతే నిబంధనల మేరకు పెన్షన్ పూర్తిగా రద్దు అవుతుంది.