సైన్యం చూపిన ధైర్యం దేశానికే గర్వకారణం

KMM: ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా శుక్రవారం చింతకాని మండలం నాగులవంచలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి భారత సైన్యం చూపిన ధైర్యం దేశానికే గర్వకారణం అని అన్నారు.