రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు

మెదక్ పట్టణంలోని మెదక్ హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీప యూటర్న్ వద్ద డిగ్రీ కాలేజీకి వెళ్లే మార్గంలో వేగంగా వచ్చిన కారు, ముందుకు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందుతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 ఈఎంటీ ప్రవీణ్, పైలట్ నరేష్ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.