VIDEO: డ్రోన్ కెమెరాలతో నిఘా
సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పుట్టపర్తి ప్రాంతంలో పోలీసులు నైట్ విజన్ డ్రోన్లతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, ఓపెన్ డ్రింకింగ్, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. ఎయిర్‌పోర్ట్ సీఐ బొజ్జప్ప నేతృత్వంలో పట్టణంలోని ప్రధాన ప్రాంతాలను డ్రోన్లతో పర్యవేక్షించారు. నేరాల నియంత్రణ తమ లక్ష్యమని పోలీసులు తెలిపారు.