తనికెళ్లలో విషాదం..డెంగ్యూతో మహిళా మృతి

తనికెళ్లలో విషాదం..డెంగ్యూతో మహిళా మృతి

KMM: కొణిజర్ల మండలం తనికెళ్లలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన కూచిపూడి హరిత శుక్రవారం డెంగ్యూతో మృతి చెందారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా తగ్గిపోవడంతో ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.