'గర్భం దాల్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'
GDWL: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రిపోర్టింగ్‌ను సెక్టార్ సూపర్వైజర్లతో కలిసి గురువారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె. సంధ్య కిరణ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి స్త్రీ గర్భం దాల్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, నాలుగో నెల నుంచి ఐరన్, కాల్షియం టాబ్లెట్లు ఇవ్వాలని సూచించారు.