హైకోర్టు ఆదేశాలతో ఇనుప కంచె తొలగింపు

TPT: ఎర్రావారిపాలెం మండలం కమలయ్య గారిపల్లె – బండ్లగానేపల్లె పంచాయతీల రహదారిపై వేసిన ఇనుప కంచెను హైకోర్టు ఆదేశాలతో పోలీసులు తొలగించారు. రహదారి మూసివేతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. కేసులో తిరుపతి ఎస్పీ, ఎన్ హెచ్, కంచె వేసిన వారిని ప్రతివాదులుగా చేర్చారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంచెను తొలగించగా రాకపోకలు ప్రారంభమయ్యాయి.