శానిటరీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమీషనర్

శానిటరీ సెక్రటరీపై  ఆగ్రహం వ్యక్తం చేసిన కమీషనర్

VZM: బొబ్బిలి కమిషనర్‌ ఎల్.రామలక్ష్మి బుధవారం పట్టణంలోని స్దానిక పాతపోస్ట్‌ అఫీస్, వెలమవారివీధి, గాంధీ బొమ్మ అంబేద్కంర్‌ బొమ్మ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత పోస్ట్‌ ఆఫీసు ప్రాంతంలో అపారిశుద్ధ్యం పేరుకుపోవడంతో శానిటరీ సెక్రటరీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో చెత్త లేకుండా చూడాలని ఆదేశించారు.