బండ్లమ్మ తల్లికి మంగళవారం ప్రత్యేక పూజలు

గుంటూరు: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో బండ్లమ్మ తల్లికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసంలో రెండవ మంగళవారం సందర్భంగా అమ్మవారికి పట్టు చీర, బంగారు ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి మహా గౌరీ అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.