VIDEO: రామకుప్పంలో హడలెత్తిస్తున్న రెండు ఏనుగులు
CTR: రామకుప్పం (M) ననియాల పరిసర ప్రాంతాల్లో రెండు ఏనుగులు రైతులను హడలెత్తిస్తున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఏనుగులు ఆహారం కోసం ననియాల గ్రామ సమీపంలోని వరి చేనులోకి రావడంతో అప్రమత్తమైన అటవీ సిబ్బంది వాటిని మళ్లీ అటవీ ప్రాంతం వైపు మళ్లించారు. గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.