చింతకొమ్మదిన్నె ఆలయ చైర్మన్‌గా మాధవ రెడ్డి ప్రమాణస్వీకారం
KDP: చింతకొమ్మదిన్నె గంగమ్మ దేవాలయం నూతన ఛైర్మన్‌గా శుక్రవారం సోముల మాధవ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఛైర్మన్‌తో పాటు మొత్తం 10 మంది సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.