కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
AP: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. మద్దతు ధర లేకపోవడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయని తెలిపారు. మొక్కజొన్న రైతుల సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు.. సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని కేంద్రానికి లేఖ రాశారు.