గడువులోగా పనులు పూర్తి చేయాలి: సీతక్క
MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. జాతర పనులు గడువులోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. గద్దెల ప్రాంగణం,భక్తులకు కావలసిన సౌకర్యాలను పరిశీలించారు. సీతక్కతో కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.